Chennai Zoo Lions | Infected with COVID 19 Delta Variant



తమిళనాడు చెన్నైలోని వాండలూర్ జూలో….. నాలుగు సింహాలకు డెల్టా వేరియంట్ రకం కరోనా సోకినట్లు జూ అధికారులు తెలిపారు. జూలోని 11 సింహాల నుంచి సేకరించిన నమూనాలను భోపాల్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ -నిషాద్ ప్రయోగశాలలో పరీక్షించారు. ఫలితాలను విశ్లేషించిన అనంతరం….9 సింహాలకు కరోనా సోకినట్లు వెల్లడైందని జూ అధికారులు తెలిపారు. వాటిలోని….. నాలుగు సింహాల్లో డెల్లా రకం వైరస్ రకాన్ని గుర్తించినట్లు చెప్పారు. జూన్ 3న 9సింహాలకు కొవిడ్ సోకినట్లు తేలగా…వాటికి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు
#LatestNews
#EtvTelangana

source