భారత్ లో సెకండ్ వేవ్ కారణమైన……. అత్యంత వేగంగా వ్యాప్తిచెందే డెల్టా వేరియంట్ కొవిడ్ వైరస్ మరిన్ని మార్పులు చెంది “డెల్టా ప్లస్ “గా మారినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. “డెల్టా ప్లస్ ” లేదా”ఏవై 1”గా పిలిచే ఈ రకం కరోనా..దేశంలో చాలా తక్కువగానే ఉందని, ఇప్పటికిప్పుడు ఆందోళన చెందాల్సిన పనిలేదని పేర్కొన్నారు. నూతన రకం వల్ల..వ్యాధి తీవ్రత పెరుగుతుందనేందుకు ఎలాంటి సంకేతాలులేవని తెలిపారు. ఐతే.. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదముద్ర వేసిన మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్ టెయిల్ చికిత్సకు… డెల్టా ప్లస్ కొవిడ్ రకం నిరోధకతను చూపుతోందని ……… శాస్త్రవేత్తలు వివరించారు. డెల్టా ప్లస్ రకం వైరస్ స్పైక్ ప్రొటీన్ లో మార్పు మానవుల్లోకి చేరేందుకు సాయపడుతున్నట్లు…….. CSIR శాస్త్రవేత్త వినోద్ స్కారియా.. వెల్లడించారు. కొత్త రకం ఎలా వ్యాప్తి చెందుతుందనే దానిని బట్టి వేగాన్ని, ఇతర అంశాలను అంచనా వేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
#LatestNews
#EtvTelangana

source

By earmpy

5 thoughts on “Delta Plus | New Covid Variant Identified, Experts Say No Cause of Concern for Now”
  1. ప్రజల షార్ట్ మెమరీ అనేది కొన్ని న్యూస్ చానల్స్ కి అక్షయపాత్ర లాంటిది. ఒకే అంశానికి సంబంధించి భయపెడుతూ ఒకసారి, తటస్థంగా మరొకసారి, ఉదాసీనం గా మరొకసారి, ఎట్టకేలకు పాజిటివ్ గా ఒకసారి చెప్తారు.
    చాలామంది ప్రజలకి షార్ట్ మెమరీ కాబట్టి ఒకే అంశానికి సంబంధించిన 4 వెర్షన్స్ నీ చూస్తూ ఉంటారు.

    ఇదే డెల్టా వైరస్- గురించి మన దేశమంటే భయపడేలా, మన దేశంలోవాళ్ళు భయపడేలా, న్యూస్ రావడం విన్నాం.

    ఎవరి పత్తి వ్యాపారం వాళ్లదేమో మరి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *